ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లెకోనలో ముగిసిన కోడి పందాలు

ABN, First Publish Date - 2021-01-17T05:00:23+05:30

మండలంలోని పల్లెకోనలో నిర్వహిస్తున్న కోడి పందాలు సంక్రాంతి సంబరాలు శనివారం రాత్రితో ముగిశాయి.

భట్టిప్రోలు మండలం పల్లెకోనలో పోటీలో తలపడుతున్న కోడి పుంజులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యథేచ్ఛగా మద్యం విక్రయాలు

కన్నెత్తి కూడా చూడని అధికారులు

భట్టిప్రోలు, జనవరి 16 :  మండలంలోని పల్లెకోనలో నిర్వహిస్తున్న కోడి పందాలు సంక్రాంతి సంబరాలు శనివారం రాత్రితో ముగిశాయి.  నాలుగు రోజుల పాటు జరిగిన కోడి పందాలు  చివరి రోజు కావడంతో పక్క జిల్లాల నుంచి పందెం రాయుళ్ళు పల్లెకోనకు తరలివచ్చారు.  బరుల్లో రూ. వేలు, రూ. లక్షల్లో పందాలు జరుగగా బరుల బయట వందలు, వేల రూపాయిలు పందాలు జరిగాయి. బహిరంగంగా స్టాల్స్‌ ఏర్పాటు చేసి యథేచ్ఛగా అధిక ధరలకు మద్యం విక్రయాలు జరిపినా సంబంధిత అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. విశాలమైన ప్రాంగణంలో పందాలు నిర్వహించేందుకు నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో సమీప మండలాల నుంచి పందెంరాయుళ్ళు, ప్రజలు పల్లెకోనకు వచ్చారు. కోడి పందాలను తిలకించేందుకు వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తరలివచ్చారు. గుండాట, పేకాట, పెద్దబజార్‌, చిన్నబజార్‌ వంటి జూద క్రీడల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. 


Updated Date - 2021-01-17T05:00:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising