ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై కేంద్రం పునరాలోచించాలి

ABN, First Publish Date - 2021-03-01T05:52:02+05:30

ఆర్థిక బలహీనవర్గాల(ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్‌లపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు విజ్ఞప్తి చేశారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కేసన శంకరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు 

గుంటూరు, ఫిబ్రవరి 28: ఆర్థిక బలహీనవర్గాల(ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్‌లపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు విజ్ఞప్తి చేశారు. గుంటూరులోని సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక వెనుకబాటు ద్వారా ఇవ్వాల్సిన రిజర్వేషన్లు నేడు ఆర్థిక అసమానతలకు ఆపాదించి   ఇవ్వటం సరికాదన్నారు. ఇటీవల కాలంలో 9 శాతం ఉన్న అగ్రకుల పేదలకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ ద్వారా 10 శాతం రిజర్వేషన్లు 124వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకువచ్చారన్నారు. అగ్రకుల పేదల రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదన్నారు. కానీ జనాభా శాతం ప్రకారం వారికి న్యాయబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలన్నారు. విలేకరుల సమావేశంలో సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌, జిల్లా అధ్యక్షుడు పరసా రంగనాఽథ్‌, కొల్లికొండ వెంకటసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-01T05:52:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising