ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలరించిన ఉగాది కవి సమ్మేళనం

ABN, First Publish Date - 2021-04-16T05:11:57+05:30

గార్డెన్స్‌ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్‌ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఉగాది కవి సమ్మేళనం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

పద్యపఠనం చేస్తున్న పీఎస్‌ఆర్‌ ఆంజనేయప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(సాంస్కృతికం), ఏప్రిల్‌ 15: గార్డెన్స్‌ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్‌ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఉగాది కవి సమ్మేళనం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాహితీవేత్తలు ఆంజనేయప్రసాద్‌, డాక్టర్‌ దేవురపల్లి ప్రభుదాస్‌, డాక్టర్‌ రామ్మడుగు వెంకటేశ్వరశర్మ, సుఖవాసి మల్లికార్జున రాయశాస్త్రి, కొణతం నాగేశ్వరరావు డాక్టర్‌ సూర్యదేవర రవికుమార్‌, నడింపల్లి హనుమంతరావు, డాక్టర్‌ నగరాజలక్ష్మి, మంచికంటి సత్యవతులు కవితలతో ప్రేక్షకులను అలరింపచేశారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయకమిటీ సభ్యులు సాహితీవేత్తలను సత్కరించారు. 

గార్డెన్‌ ఆలయ దర్శన వేళల్లో మార్పు

కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో గార్డెన్స్‌ శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు మస్తానయ్య తెలిపారు. ప్రతి రోజు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు మాత్రమే భక్తులకు స్వామి దర్శనానికి అనుమతిస్తామన్నారు. 

Updated Date - 2021-04-16T05:11:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising