ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేగంగా.. టీకా

ABN, First Publish Date - 2021-01-22T06:13:11+05:30

కొవిడ్‌-19 నివారణకు ఇచ్చే కొవిషీల్డ్‌ వ్యాక్సినేషన్‌ మరింత వేగంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ జిల్లా అధికార యంత్రాంగానికి సూచించింది.

కొవిడ్‌ వ్యాక్సిన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పర్సంటేజీ పెంచాలని కేంద్రం ఆదేశాలు

జిల్లాలో సగటున 60 శాతమే వ్యాక్సినేషన్‌ 

గుంటూరు(మెడికల్‌), జనవరి 21: కొవిడ్‌-19 నివారణకు ఇచ్చే కొవిషీల్డ్‌ వ్యాక్సినేషన్‌ మరింత వేగంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ జిల్లా అధికార యంత్రాంగానికి సూచించింది. ప్రతి రోజూ సమీక్షలు జరపాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ప్రస్తుతం 60 శాతం లోపే వ్యాక్సినేషన్‌ నమోదౌతున్న నేపథ్యంలో దీనిని కనీసం 90 శాతానికి పెంచేందుకు కృషి చేయాలని సూచించినట్లు సమా చారం. అధికారులు ఆశించిన స్థాయిలో టీకాల కార్యక్రమానికి ఆరోగ్య సిబ్బంది నుంచి స్పందన కనిపించడం లేదు. చాలా మంది పేర్లు నమోదు చేసుకున్నా తీరా వ్యాక్సినేషన్‌ రోజు రావడంలేదు. దీంతో జిల్లాలో 60 శాతం లోపే వ్యాక్సినేషన్‌ నమోదైంది. బుధవారం వరకు జిల్లాలో 14,635 మందికి టీకాలు వేసేందుకు కొ-విన్‌ యాప్‌ ద్వారా పిలవగా, వీరిలో 8,780 మంది మా త్రమే వ్యాక్సినేషన్‌ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో వ్యాక్సినేషన్‌ పెంచేందుకు కలెక్టర్‌ నేతృత్వంలో ప్రతి రోజూ సమీక్ష జరిపి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. జిల్లాలో గురువారం 31 కేంద్రాల్లో 928 మం దికి (72 ఽఽశాతం) టీకాలు వేశారు. కొ-విన్‌ యాప్‌లో 1277 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే 928 మంది మాత్రమే టీకా వేసు కునేందుకు హాజరైనట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. 

17 మందికి కరోనా


జిల్లాలో గురువారం ఉదయం వరకు అందిన 5,568 శాంపిల్స్‌ ఫలితాల్లో 17 మందికి కరోనా వైరస్‌ సోకింది. మిగతా 5,551  మందికి నెగెటివ్‌గా నిర్ధారణ జరిగింది. కొత్తగా తాడేపల్లిలో 4, గుంటూరు నగరంలో 3, నరసరావు పేటలో 3, బెల్లంకొండ, ముప్పాళ్ల, పెదనందిపాడు, తుళ్లూరు, పిడుగురాళ్ల, చిలకలూరిపేట, పొన్నూరులో ఒక్కో కేసు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు 76,974 మంది కొవిడ్‌ బారిన పడగా వారిలో 76,006(98.74 శాతం) మంది కోలుకున్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా 5,546 మంది కరోనా టెస్టులు చేయించుకున్నారు.


Updated Date - 2021-01-22T06:13:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising