ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయరాఘవన్‌పై కూడా కేసు పెడతారా...?

ABN, First Publish Date - 2021-05-09T05:33:35+05:30

దేశంలో తప్పకుండా కరోనా మూడోవేవ్‌ వస్తుందని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక సలహాదారు విజయరాఘవన్‌పై కూడా కేసు పెట్టమని ప్రధాని మోదీకి సీఎం జగన్‌రెడ్డి సలహా ఇస్తారేమోనని రాష్ట్ర టీడీపీ కార్యాదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనపర్తి శ్రీనివాసరావు

గుంటూరు, మే 8(ఆంధ్రజ్యోతి): దేశంలో తప్పకుండా కరోనా మూడోవేవ్‌ వస్తుందని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక సలహాదారు విజయరాఘవన్‌పై కూడా కేసు పెట్టమని ప్రధాని మోదీకి సీఎం జగన్‌రెడ్డి సలహా ఇస్తారేమోనని రాష్ట్ర టీడీపీ కార్యాదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. పశ్చిమ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కొవిడ్‌ మహమ్మారి నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రఖ్యాత మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌లో సంపాధకీయం రాసినందుకు వారిపై కూడా కేసు పెడతారా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రధానిపై జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు గాని, ఆ పార్టీ నాయకులుగాని ఎవరూ స్పందించకపోయినా.. తగుదనమ్మా అంటూ సీబీఐ కేసులకు భయపడి సీఎం జగన్‌ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌, రెవ్‌డిసివర్‌లు లేక మరణిస్తున్న వారి కుటుంబసభ్యులు ఎవరిపైన కేసులు పెట్టాలో ప్రభుత్వ పెద్దలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ తనస్థాయి మరిచి బీజేపీ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రెండో ఉధృతిని ముందుగానే ఊహించి సొంతగా ఆక్సిజన్‌ తయారు చేసుకోవటమే కాక ఇతర రాష్ర్టాలకు సైతం సొంతగా ఆక్సిజన్‌ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిన పొరుగు రాష్ట్రాలు కేరళ, ఒడిశాను చూసి ఏపీ పాలకులు సిగ్గుతో తలవంచుకోవాలని కనపర్తి  అన్నారు.  

Updated Date - 2021-05-09T05:33:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising