ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘‘వారి సర్వీసులన్నీ రెగ్యులరైజ్ అవుతాయి’’

ABN, First Publish Date - 2021-08-22T22:06:49+05:30

అమరావతి: డిపార్ట్‌మెంట్ పరీక్ష పాసైన వారి సర్వీసులన్నీ.. రెగ్యులరైజ్ అవుతాయని సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: డిపార్ట్‌మెంట్ పరీక్ష పాసైన వారి సర్వీసులన్నీ.. రెగ్యులరైజ్ అవుతాయని సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సమస్యలను గతంలో సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అక్టోబర్ నుంచి ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని సీఎంను కోరగా.. వారు అంగీకరించారని చెప్పారు. 

నిబంధనల ప్రకారం 1.34 లక్షల మంది సచివాలయ ఉద్యోగుల సర్వీసులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తుందన్నారు. ఇప్పటిదాకా 50శాతం మంది పరీక్ష పాసయ్యారని వివరించారు. సచివాలయ సిబ్బందికి ఇబ్బందవుతుందని సీఎం జగన్.. నెగెటివ్ మార్కులను తొలగించారని చెప్పారు. 8 కేటగిరీ ఉద్యోగులకు డిపార్టుమెంట్ పరీక్షలు ఉండవన్నారు. వారి సర్వీసులను నేరుగా రెగ్యులర్ చేయాలని.. పదోన్నతి సమయంలో పరీక్ష పెట్టాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-08-22T22:06:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising