ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన జాతీయస్థాయి కబడ్డీ పోటీలు

ABN, First Publish Date - 2021-01-17T05:25:29+05:30

మండలంలోని ముప్పాళ్ళ గ్రామంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు శనివారం రాత్రి ముగిశాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 45 జట్లు పొల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న జీవీ ఆంజనేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం జిల్లా చినగంజాం జట్టుకు ప్రథమ స్థానం

ఈపూరు, జనవరి 16: మండలంలోని ముప్పాళ్ళ గ్రామంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు శనివారం రాత్రి ముగిశాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 45 జట్లు పొల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. నాకౌట్‌ కమ్‌ లీగ్‌ పద్ధతిలో జరిగిన పోటీలలో ప్రకాశం జిల్లా చినగంజాం జట్టు ప్రథమ స్థానం సాధించగా, గుంటూరు జిల్లా ఆరేపల్లి ముప్పాళ్ళ జట్టు ద్వితీయ స్థానం సాధించింది. తృతీయ బహుమతి చినగంజాం (జూనియర్‌) జట్టు పొందాయి. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా నెహ్రూనగర్‌, పిడుగురాళ్ళ సెవన్‌ స్టార్స్‌, వైజాగ్‌,  లక్ష్మీ నరసింహ జట్టు, ముప్పాళ్ళ యోగి జట్టు, తిరుమల కాలేజి (నరసరావుపేట) జట్లు నిలిచాయి. బహుమతులను టీడీపీ నరసరావుపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అందజేశారు. కార్యక్రమంలో రాపర్ల జగ్గారావు, సూరే కోటేశ్వరరావు, తల్లపనేని రామారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-17T05:25:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising