ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఈఈ అడ్వాన్స్‌లో.. పదో ర్యాంక్‌

ABN, First Publish Date - 2021-10-17T06:13:19+05:30

జాతీయస్థాయిలో ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్‌ ఫలితాల్లో జిల్లాకు విద్యార్థులు సత్తాచాటారు.

రుషికేష్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(విద్య), అక్టోబరు 16: జాతీయస్థాయిలో ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్‌ ఫలితాల్లో జిల్లాకు విద్యార్థులు సత్తాచాటారు. ఈనెల  3న జరిగిన అడ్వాన్స్‌ పరీక్షకు జిల్లా నుంచి దాదాపు 6వేలమంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో జిల్లాకు చెందిన మోదుల రుషికేష్‌రెడ్డి 10వ ర్యాంకు సాధించి జాతీయస్థాయిలో జిల్లాఖ్యాతిని నిలిపాడు. అదేవిధంగా జిల్లాకు చెందిన కె.సాయుయిలోకేష్‌ 16వ ర్యాంకు, జి.ఆశిష్‌సాయి 21, ఎ.వినాయకకన్నా 40 ర్యాంకులు సాధించారు. అదేవిధంగా హేరంబనాథ్‌ 118 ర్యాంకు, జి.నవ్యదీపిక 188, డి.భావనశ్రీ హర్షిత 278, బి.తేజ 459, శామ్యూల్‌ 611, ప్రమోద్‌  813, తేజస్విని, చల్లా నాగసృజన్‌ 906 ర్యాంకులతో ప్రతిభ చాటారు.  

10వ ర్యాంకర్‌ రుషికేష్‌ తల్లిదండ్రులు శ్రీదేవి, జగదీష్‌రెడ్డి, ఎస్‌బీఐలో పనిచేస్తూ అంకిరెడ్డిపాలెంలోని నివాసం ఉంటున్నారు. ర్యాంకు సాధించిన రుషికేష్‌రెడ్డి మాట్లాడుతూ పది కేకేఆర్‌ గౌతమ్‌లో పూర్తిచేసి ఇంటర్‌ విజయవాడ శ్రీచైతన్యలో చదివినట్లు తెలిపారు. ఇంటర్‌లో 982 మార్కులు సాధించినట్లు విరించారు. ఇటీవల ప్రకటించిన ఎంసెట్‌ ఫలితాల్లో 25వ ర్యాంకు సాధించినట్లు తెలిపాడు. ఐఐటీజేఈఈ అడ్వాన్స్‌ కోసం రోజుకు 14 నుంచి 17 గంటలు ప్రణాళికబద్ధంగా చదివినట్లు పేర్కొన్నాడు. ఐఐటీ ముంబైలో కంప్యూటర్‌ సైన్స్‌లో సీటు సాధించి, ఇంజనీరింగ్‌ తరువాత పదిమందికి ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తానని తెలిపాడు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో ఈ స్థాయిలో ర్యాంకు సాధించినట్లు వివరించాడు.

Updated Date - 2021-10-17T06:13:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising