ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.437 కోట్లతో హార్బర్‌ రెండోదశ

ABN, First Publish Date - 2021-07-30T06:05:09+05:30

నిజాంపట్నంలోని హార్బర్‌ రెండోదశను ప్రభుత్వం రూ.437 కోట్లతో అభివృద్ధి చేయనున్నదని జేసీ దినేష్‌కుమార్‌ తెలిపారు.

హార్బర్‌లో మ్యాపును పరిశీలిస్తున్న జేసీ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, సబ్‌కలెక్టర్‌ నిధిమీనా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్థలాన్ని పరిశీలించిన జేసీ దినేష్‌కుమార్‌ 

రేపల్లె, జూలై 29: నిజాంపట్నంలోని హార్బర్‌ రెండోదశను ప్రభుత్వం రూ.437 కోట్లతో అభివృద్ధి చేయనున్నదని జేసీ దినేష్‌కుమార్‌ తెలిపారు. గురువారం  హార్బర్‌ను సందర్శించిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అభివృద్ధికి అవసరమైన స్థలం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. హార్బర్‌ రెండో దశలో మొదట జెట్టీ నిర్మాణానికి, మెకనైజ్‌డ్‌ బోట్లు, మోటార్‌బోట్లు, నిలిపేందుకు అవసరమైన 5 ఎకరాలను అటవీభూమి నుంచి సేకరించాల్సి ఉందన్నారు. అటవీశాఖకు ఈ మేరకు ప్రతిపాదనలు పంపుతామని అనుమతి వచ్చాక పనులు ప్రారంభం అవుతాయన్నారు. జెట్టీ ని ఏ ప్రాంతంలో నిర్మిస్తే బాగుంటుందనే విషయంపై స్థానిక మత్స్యకారుల నుంచి సలహాలు స్వీకరించారు. ప్రస్తుతం ఉన్న జెట్టీని పొడిగించటమా, తూర్పు తుంగభద్ర కాలవ వైపు కొత్తగా నిర్మించటమా అని అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో తెనాలి సబ్‌ కలెక్టర్‌ నిధిమీనా, మత్స్యశాఖ డీడీ రాఘవరెడ్డి, ఏడీ గాలిదేవుడు, డ్రెయినేజి డీఈ దీనదయాళ్‌, బోటు ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కన్నా శ్రీనివాసరావు, కేవీఆర్‌, మోపిదేవి ఆదిశేషు, తహసీల్దారు శ్రీనివాస్‌, ఎంపీడీవో నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-30T06:05:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising