ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఛలో విశాఖకు భారీగా జనసైనికులు

ABN, First Publish Date - 2021-10-27T04:26:40+05:30

కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 31న జనసేన అధినేత పవన కల్యాణ్‌ వైజాగ్‌లో పాల్గొనే సభకు జిల్లా నుంచి పదివేల మంది జనసైనికులు తరలివెళ్లనున్నట్లు జనసేన నేతలు ప్రకటించారు.

మాట్లాడుతున్న బోనబోయిన, గాదె, కమాల్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనసేన నేతలు బోనబోయిన, గాదె వెల్లడి

గుంటూరు, అక్టోబరు 26: కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 31న జనసేన అధినేత పవన కల్యాణ్‌ వైజాగ్‌లో పాల్గొనే సభకు జిల్లా నుంచి పదివేల మంది జనసైనికులు తరలివెళ్లనున్నట్లు జనసేన నేతలు ప్రకటించారు. బ్రాడీపేటలోని ఓ హోటల్‌లో మంగళవారం జనసేన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌, నేతలు నాయబ్‌ కమాల్‌, వడ్రాణం మార్కాండేయబాబు తదితరులు మాట్లాడారు. జిల్లాలో గురజాల, దాచేపల్లి నగర పంచాయతీలకు త్వరలో జరిగే కౌన్సిలర్‌ ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా జనసేన పార్టీ అభ్యర్థులపై వైసీపీ నాయకులు తీవ్రస్ధాయిలో బెదిరింపులకు పాల్పడుత్నుట్లు బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరోపించారు. వైసీపీ ఎంత కుయుక్తులు పన్నినా జనసేన అభ్యర్థులు రెండు చోట్ల కౌన్సిలర్లుగా పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. నవంబర్‌ ఒకటిన అమరాతి రైతాంగం తలపెట్టిన ’న్యాయస్ధానం నుంచి దేవస్థానం వరకు’ పాదయాత్రకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు  ప్రకటించారు. 

Updated Date - 2021-10-27T04:26:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising