ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేద్కర్‌ జెండా ఎగురవేస్తాం

ABN, First Publish Date - 2021-01-27T06:01:49+05:30

రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పాడి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అంబేద్కర్‌ జెండా ఎగురవేస్తామని జైభీమ్‌ యాక్సస్‌ జస్టిస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

ఎడ్లబండిపై ఊరేగింపుగా వెళుతున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్‌కుమార్‌ 

 బాపట్ల, జనవరి 26 : రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పాడి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అంబేద్కర్‌ జెండా ఎగురవేస్తామని జైభీమ్‌ యాక్సస్‌ జస్టిస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ న్యాయమూర్తి  జడ శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు.  మంగళవారం బాపట్ల పట్టణంలోని అంటరానితన నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో దళితుల ఆత్మీయ కలయిక సభకు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.  ఏఎన్‌పీఎస్‌ రాష్ర్టాధ్యక్షుడు చార్వాక అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో జడ శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో  దళిత బహజనులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగాయన్నారు. ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌పార్టీ రాష్ర్టాధ్యక్షుడు బషీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ దళితులకు మేనమామను అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు.  కార్యక్రమంలో ఏపీజెఎఫ్‌ రాష్ర్టాధ్యక్షుడు కృష్ణాంజనేయులు, జేఏజే నాయకులు కొండలురావు, చింతా వెంకటేశ్వర్లు, సురేష్‌కుమార్‌, గుంటూరు జిల్లా అధ్యక్షులు బడుగు భరత్‌, గురవయ్య, మహిళనాయకులు రూప సుమ, మేరీ, న్యాయవాది సుజాత, వికాస్‌, మదు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-27T06:01:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising