ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుద్యోగుల అక్రమ అరెస్టు దారుణం : సీపీఎం

ABN, First Publish Date - 2021-07-19T14:33:06+05:30

ఉద్యోగాల కోసం పోరాటం నిరుద్యోగుల అక్రమ అరెస్టు దారుణమని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేపల్లె: ఉద్యోగాల కోసం పోరాటం నిరుద్యోగుల అక్రమ అరెస్టు దారుణమని సీపీఎం రేపల్లె డివిజన్‌ కార్యదర్శి మణిలాల్‌ అన్నారు. ఆదివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో నిరుద్యోగుల అరెస్టుకు నిరసన తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కలిపి జాబ్‌ కాలెండర్‌ను ప్రకటించాలని జూలై 19న తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద శాంతియుతంగా ధర్నా చేయాలని విద్యార్థి, యువజన సంఘాలు పిలుపు ఇచ్చారన్నారు. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి నుంచి నిరుద్యోగులను, విద్యార్థి, యువజన సంఘాల నేతల అక్రమ అరెస్టులు మానుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఐ లీలాకోటేశ్వరరావు, వినయ్‌, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. 


బోగస్‌ జాబ్‌ కాలెండర్‌ మాకొద్దు : ఎస్‌ఎఫ్‌ఐ

రేపల్లె: జాబ్‌లేని జాబ్‌ కాలెండర్‌ కాదు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భ ర్తీ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రేపల్లె డివిజన్‌ కార్యదర్శి కేవీ లక్ష్మణరావు అన్నారు. ఆదివారం స్థానిక బస్టాండ్‌ సెంటర్లో బోగస్‌ జాబ్‌ కాలెండర్‌ను ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ అరెస్టులు చేసినా తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద ధర్నా ఉంటుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 2లక్షల ఉద్యోగాల నోటిఫి కేషన్‌ ఇచ్చే వరకు దశలవారీగా పోరాడతామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు లీలా కోటేశ్వరరావు, నవీన్‌, ఇశ్రాయేల్‌, వినయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-19T14:33:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising