ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం

ABN, First Publish Date - 2021-05-18T06:25:31+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాథాన్యం ఇస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. సోమవారం గుంటూరులోని ఎన్టీఆర్‌ స్టేడియం, వెంగళాయపాలెం వద్ద నిర్మిస్తున్న డాక్టర్‌ వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల్‌కు ఆమె శంకుస్థాపన చేశారు.

అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌కి శంకుస్థాపన చేస్తున్న హోంమంత్రి మేకతోటి సుచరిత, మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, కమిషనర్‌ చల్లా అనురాధ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హోంమంత్రి మేకతోటి సుచరిత

గుంటూరు(కార్పొరేషన్‌), మే 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాథాన్యం ఇస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. సోమవారం గుంటూరులోని ఎన్టీఆర్‌ స్టేడియం, వెంగళాయపాలెం వద్ద నిర్మిస్తున్న డాక్టర్‌ వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల్‌కు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి మండలంలో రెండు హెల్త్‌ సెంటర్ల నిర్మిస్తుందన్నారు.  ఒక్కొక్క హెల్త్‌ సెంటర్‌ నిర్మాణానికి రూ.80 లక్షలు కేటాయించిందన్నారు. నగరంలో ఉన్న హెల్త్‌ సెంటర్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. నగర మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌నాయుడు మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో 18 వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఆరోగ్య కేంద్రాలలో 10 బెడ్లతో పాటు 38 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తారన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరి మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా కరోనా చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత సీఎం జగన్‌కే చెల్లుతుందన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ చల్లా అనురాధ, కార్పొరేటర్లు చల్లా రాజ్యలక్ష్మి, ఉడుముల లక్ష్మి, ఈరంటి వరప్రసాద్‌, బూసి రాజలత, నాయకులు యోగేశ్వర్‌రెడ్డి, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-18T06:25:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising