ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటీఎస్‌ మెగా మేళాలో 3,883 మంది దరఖాస్తు

ABN, First Publish Date - 2021-12-05T05:57:49+05:30

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం(ఓటీఎస్‌) కింద శనివారం నిర్వహించిన మెగామేళాలో 3,883 మంది దరఖాస్తు చేసుకొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పటివరకు 16,303 మంది నగదు చెల్లింపు

జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌


గుంటూరు, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం(ఓటీఎస్‌) కింద శనివారం నిర్వహించిన మెగామేళాలో 3,883 మంది దరఖాస్తు చేసుకొన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ఓటీఎస్‌ మొత్తాన్ని చెల్లించారు. ఈ ఒక్క రోజే రూ.3,78,77,040 నగదు ప్రభుత్వ ఖజానాకు జమ అయినట్లు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 16,303 మంది రూ.15 కోట్ల 82 లక్షల ఏక మొత్తం రుణాన్ని చెల్లించారని పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఓటీఎస్‌ స్కీమ్‌ పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లోని వారు రూ.10 వేలు, పురపాలక సంఘాల్లోని లబ్ధిదారులు రూ.15 వేలు, నగరపాలకసంస్థలో రూ.20 వేలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఉచితంగా రిజిస్ట్రేషన్‌ సంబంధిత గ్రామ/వార్డు సచివాలయాల్లోనే జరిపిస్తామని చెప్పారు. సంపూర్ణ గృహ హక్కు పత్రం ఉపయోగించి బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చని తెలిపారు. 

Updated Date - 2021-12-05T05:57:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising