ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంధ్రా సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించండి: ఎమ్మెల్సీ జంగా

ABN, First Publish Date - 2021-02-27T18:40:07+05:30

ఆంధ్రా సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులతో కలిసి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి శనివారం జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలపై కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఆంధ్రా సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులతో కలిసి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి శనివారం జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలపై కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ జంగా మీడియాతో మాట్లాడుతూ దాచేపల్లి మండలం గామాలపాడు ఆంధ్ర సిమెంట్ ఫ్యాక్టరీని 2011లో జేపీ గ్రూప్ తీసుకుందని... కానీ  పూర్తి స్థాయిలో ఫ్యాక్టరీ నడపడం లేదని తెలిపారు. ఆరు నెలలుగా కార్మికులకు జీతాలు లేవన్నారు. ఆరు గ్రామాలకు చెందిన వేయి మంది కుటుంబాలు రోడ్డున్న పడ్డాయని చెప్పారు. దీనిపై పలు మార్లు యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చిన ఫలితం లేదని చెప్పారు. కలెక్టర్‌ను కలిసి ఆంధ్రా సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరామన్నారు. లాకౌట్ గానీ, లేఅవుట్ గాని  ప్రకటించలేదని తెలిపారు. కార్మికులకు అండగా ఉండేందుకు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తామని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలియజేశారు. 

Updated Date - 2021-02-27T18:40:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising