ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య వృత్తి పవిత్రమైనది

ABN, First Publish Date - 2021-03-24T05:40:25+05:30

డాక్టర్లుగా కొత్తగా వైద్య రంగంలోకి ప్రవేశించే వారు నైతిక విలువలకు కట్టుబడి వైద్య వృత్తి విలువలను కాపాడాలని ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఎథిక్స్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ జి.వేణుగోపాలరావు పిలుపునిచ్చారు.

డాక్టర్‌ వేణుగోపాలరావును సత్కరిస్తున్న జీఎంసీ ప్రిన్సిపాల్‌ బాబులాల్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డాక్టర్‌ వేణుగోపాలరావు

గుంటూరు(మెడికల్‌), మార్చి 23: డాక్టర్లుగా కొత్తగా వైద్య రంగంలోకి ప్రవేశించే వారు  నైతిక విలువలకు కట్టుబడి వైద్య వృత్తి విలువలను కాపాడాలని ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఎథిక్స్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ జి.వేణుగోపాలరావు పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరు వైద్య కళాశాల జింకానా ఆడిటోరియంలో హౌస్‌ సర్జన్లను ఉద్ధేశించి ఆయన ప్రసంగించారు. వైద్య వృత్తి పవిత్రమైదన్నారు. రోగులకు సేవలు అందించే డాక్టర్లు మానవీయ విలువలకు పెద్ద పీట వేసి సేవే పరమావధిగా పని చేయాలన్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా ఈ వృత్తిలోకి రాకూడదన్నారు. వైద్యులు తమ భావవ్యక్తీకరణ సామర్ధ్యం పెంచుకొని రోగులతో పాటు ఇతర వైద్య సిబ్బందితో సత్సంబంధాలు నెలకొల్పాలన్నారు. అనంతరం డాక్టర్లు పాటించాల్సిన నైతిన నియమావళిని ఆయన పవర్‌ పాయింట్‌ ద్వారా వివరించారు. జీఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.బాబులాల్‌, వైస్‌ ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ సీహెచ్‌ పద్మావతిదేవి, డాక్టర్‌ టీటీకే రెడ్డి తదితరులు డాక్టర్‌ వేణుగోపాలరావును సన్మానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యుల సంఘం కార్యదర్శి డాక్టర్‌ డీఎస్‌ఎస్‌ శ్రీనివాసప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-24T05:40:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising