పొట్టనొప్పి రోగికి జీజీహెచలో అరుదైన శస్త్రచికిత్స
ABN, First Publish Date - 2021-09-17T05:47:54+05:30
పొట్టనొప్పితో బాధపడుతున్న రోగికి గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో గురువారం అరుదైన చికిత్స చేశారు.
గుంటూరు(జీజీహెచ), సెప్టెంబరు 16: పొట్టనొప్పితో బాధపడుతున్న రోగికి గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో గురువారం అరుదైన చికిత్స చేశారు. కృష్ణాజిల్లా పామర్రు గ్రామానికి చెందిన గారపాటి శ్రీనివాసరావు కొంతకాలంగా విపరీతమైన పొట్టనొప్పితో బాధపడుతుండగా ఈ నెల 13న జీజీహెచకి తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షలు చేసి ప్యాక్రియాటైటిన వాపు వల్ల పొట్టలో నీటితిత్తులు ఉన్నాయని గుర్తించారు. డాక్టర్ కవిత, సహవిభాగాధిపతి డాక్టర్ షేక్ నాగూర్‌బాషా, మత్తువైద్యులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ భీమేశ్వరరావు నీటితిత్తిని తగ్గించడానికి చిన్న స్టంట్ ఇచ్చారు. వైద్యరంగంలో సాంకేతిక మార్పులు రావడంతో కేవలం 20 నిమిషాల్లో శస్త్రచికిత్స చేసి రోగికి ప్రాణం పోసినట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి డాక్టర్ కవిత బృందానికి అభినందనలు తెలిపారు.
Updated Date - 2021-09-17T05:47:54+05:30 IST