ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటల బీమాలో అక్రమాలపై విచారణ జరిపించాలి

ABN, First Publish Date - 2021-12-04T05:46:50+05:30

తమకు అందాల్సిన పంటల బీమాలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని కృష్ణా జిల్లా తోటవల్లూరు మండలం తోడేళ్ళలంకదిబ్బ గ్రామరైతులు శుక్రవారం చుట్టుగుంటలోని రాష్ట్ర వ్యవసాయ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.

రాష్ట్ర వ్యవసాయ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న కౌలురైతు సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(తూర్పు), డిసెంబరు 3: తమకు అందాల్సిన పంటల బీమాలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని కృష్ణా జిల్లా తోటవల్లూరు మండలం తోడేళ్ళలంకదిబ్బ గ్రామరైతులు శుక్రవారం చుట్టుగుంటలోని రాష్ట్ర వ్యవసాయ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కౌలురైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్యమాట్లాడుతూ 2020లో కృష్ణానదికి వచ్చిన వరదల కారణంగా గ్రామానికి చెందిన దాదాపు 110మంది రైతులు తమ పంటలను నష్టపోయారని తెలిపారు. రైతుభరోసా కేంద్రాల్లో జరిగిన అవకతవకల కారణంగా ఇంతవరకు బీమా సొమ్ము అందలేదన్నారు. అనంతరం అగ్రికల్చరల్‌ రాష్ట్ర కమిషనర్‌ అరుణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.ఽ ధర్నాలో వై.రాధాకృష్ణ, బైరగాని శ్రీనివాసరావు, రంగారావు, వై.లెనిన్‌, రైతులు సాంబయ్య, వీర్రాజు, లక్ష్మయ్య, సోమేశ్వరరావు, సుబ్బారెడ్డి, ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-04T05:46:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising