ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ అభ్యర్థులకు బెదిరింపులు

ABN, First Publish Date - 2021-10-30T04:42:12+05:30

దాచేపల్లి, గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ అభ్యర్థులపై కేసులు పెడతామని, జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు.

యరపతినేని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే యరపతినేని 

దాచేపల్లి, అక్టోబరు 29: దాచేపల్లి, గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ అభ్యర్థులపై కేసులు పెడతామని, జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. శుక్రవారం దాచేపల్లిలోని టీడీపీ మండల పార్టీ కార్యాల యంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. సమావేశంలో యరపతినేని మాట్లాడుతూ గత రెండున్నరేళ్లలో దాచేపల్లి, గురజాల నగర పంచాయతీలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. దీంతో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను అడిగే నైతికత వైసీపీ కోల్పోయిందన్నారు. ఇసుక, మద్యం, మట్టి, గంజాయి, రేషనబియ్యం, గుట్కా అమ్మకాలు జరపటంతో వైసీపీ నాయకులు ఆర్థికంగా బలపడ్డారని ఆరోపించారు. ఈ పంచాయతీల్లో వైసీపీ అనుకూలంగా వార్డులు, ఓటర్ల మార్పులు చేర్పులు ఇష్టానుసారంగా చేశారని అన్నారు. వైసీపీ పార్టీ మునిగిపోయే పడవలాంటిదని వారిని నమ్ముకొని విధులు నిర్వహిస్తే చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. విద్యుత చార్జీలు, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరగటంతో సామాన్యుల జీవితాలు భారంగా మారాయన్నారు. దశాబ్దాల తరబడి పనిచేస్తున్న ఎయిడెడ్‌ పాఠశాలలను మూసివేయించటం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేయటమేనన్నారు.

Updated Date - 2021-10-30T04:42:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising