ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోచుకోవటం తప్ప ఇంకేమీ చేయలేదు

ABN, First Publish Date - 2021-10-26T05:50:54+05:30

రెండున్నరేళ్లలో వైసీపీ పాలనలో అక్రమ మద్యం, గుట్కా మాఫియాతో దోచుకోవటం తప్ప ఇంకేమీ చేయలేదని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే యరపతినేని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గురజాలలో వైసీపీకి ఓటు అడిగే హక్కు లేదు

గురజాల, దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ

కార్యకర్తల సమావేశంలో యరపతినేని శ్రీనివాసరావు

పిడుగురాళ్ల, గురజాల, అక్టోబరు 25: రెండున్నరేళ్లలో వైసీపీ పాలనలో అక్రమ మద్యం, గుట్కా మాఫియాతో దోచుకోవటం తప్ప ఇంకేమీ చేయలేదని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం స్థానిక చల్లగుండ్ల గార్డెన్సలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురజాల పట్టణాభివృద్ధి టీడీపీ హయాంలో జరిగిందేతప్ప ఈ రెండున్నరేళ్లలో ఏ ఒక్కపని చేయలేదన్నారు. ఆర్డీవో కార్యాలయం, పంచాయతీరాజ్‌ గెస్ట్‌హౌస్‌, ఐసీడీఎస్‌, వ్యవసాయశాఖ భవన నిర్మాణాలతోపాటు రహదారుల విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌ చేపట్టిన ఘనత టీడీపీదేనన్నారు. గురజాలలో ఓటు అడిగే హక్కు వైసీపీకి లేదని తెలిపారు. రెండున్నరేళ్లలో ఏమి అభివృద్ధి సాధించారని ఓటు అడుగుతారని ప్రశ్నించారు. అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని మండిపడ్డారు. రెండున్నరేళ్లలో ఏడుగురు టీడీపీ కార్యకర్తలను హత్య చేయగా మరో ఏడుగురు చిన్నారులను అక్రమ మైనింగ్‌కు బలితీసుకున్నారన్నారు. ఎంపీటీసీ, సర్పంచ ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకొని ఏకపక్షంగా ఎన్నికలు లేకుండా చేసుకున్నారన్నారు. గురజాల, దాచేపల్లి  నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని తెలిపారు. పెరిగిన నిత్యావసర ధరలు, పెట్రోల్‌, డీజిల్‌, సామాన్యుడికి సైతం ఏమీ కొనేటట్లు లేదన్న విషయం, టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూపి ఓటు అడుగుతామన్నారు. అక్రమ కేసులకు టీడీపీ నాయకులు, కార్యకర్తలెవరూ భయపడరని తెలిపారు. పార్టీ కేంద్రకార్యాలయంపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారన్నారు. టీడీపీ నుంచి వెళ్లిన వల్లభనేని వంశీకి చంద్రబాబు, పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని తెలిపారు. సమావేశంలో నాయకులు పులుకూరి కాంతారావు, యేచూరి శ్రీనివాసరావు, మాలపాటి శ్యామ్‌, ఆకుల పిచ్చయ్య గుప్తా, మాబుభాష, బషీర్‌, నజీమూన, రామకృష్ణ, మద్దినేని శ్రీనివాసరావు, కత్తి ప్రసంగి, దానం ,పోటు నాగేశ్వరరావు, గనుపల్లి శ్యామ్‌, నెల్లూరి శివనాగేంద్రం, శివనాగు, ఐనాల నాగయ్య, చావా రామారావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T05:50:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising