ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 రేట్లు ఎక్కువగానే కరోనా మరణాలు

ABN, First Publish Date - 2021-06-18T05:24:09+05:30

ప్రభుత్వం చెప్పిన దానికంటే మే నెలలో 10 రెట్లకు పైగానే కరోనా మరణాలు సంభవించాయని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

తెనాలి శ్రావణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చెప్పిన దానికంటే మే నెలలో 10 రెట్లకు పైగానే కరోనా మరణాలు సంభవించాయని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. గురువారం ఆయన ఆన్‌లైన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కరోనాను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించిందన్నారు. ఆక్సిజన్‌ అందక, మందులు లేక, ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ లేక మరణించినవారే ఎక్కువన్నారు. ఇలాంటి మరణాలన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలన్నారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్లు చనిపోతున్నా పాలకులు లెక్కచేయటం లేదని మండిపడ్డారు. మాస్కే పెట్టుకోని నాయకత్వంలో ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికారన్నారు. కరోనా చికిత్స కోసం 10 నుంచి 12 ఆసుపత్రులకు తిరిగినవారు ఎందరో ఉన్నారని తెలిపారు.  సూది ఉంటే మందు లేదు, మందుంటే సూది లేదు.. పడకలుంటే ఆక్సిజన్‌ ఉండదు, ఆక్సిజన్‌ లభిస్తే పడకలుండని దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. మందులు, ఇంజక్షన్లు ఆఖరికి శ్మశానాల వద్ద కట్టెలను కూడా బ్లాక్‌లో అమ్ముతున్నా  ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 

 

Updated Date - 2021-06-18T05:24:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising