ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాషా్ట్రనికి అంధకారమే మిగిలింది

ABN, First Publish Date - 2021-10-18T05:00:35+05:30

జగన్మోహనరెడ్డి అధికారంలో రాషా్ట్రనికి అంధకారమే మిగిలిందని టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపించారు.

జీవీ ఆంజనేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవీ ఆంజనేయులు

గుంటూరు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): జగన్మోహనరెడ్డి అధికారంలో రాషా్ట్రనికి అంధకారమే మిగిలిందని టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ  అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఆదివారం ఆయన ఆనలైనలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ముందు చూపంతా అవినీతి, దోపిడీపైనే ఉందంటూ మండిపడ్డారు. ఫ్యాన్లు, ఏసీలు ఆపేయాలని ప్రజలకు సలహాలిస్తున్న ప్రభుత్వ పెద్దలు, ఆ పనిచేస్తున్నారా అంటూ నిలదీశారు. రాష్ట్రంలో ఎక్కడా కరెంట్‌ కోతలు లేవని చెబుతున్న మంత్రి బాలినేని తన నియోజకవర్గానికి వచ్చినా, లేక తనతో సీఎం నియోజకవర్గం పులివెందులకు వచ్చినా విద్యుత కోతలు ఏ స్థాయిలో ఉన్నాయో చూపిస్తానని సవాలు విసిరారు. అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి కూడా విద్యుత ఛార్జీలు పెంచబోమని చెప్పి, రెండున్నరేళ్ల పాలనలోనే 6సార్లు ఛార్జీలు పెంచిన ఘనత మీది కాదా అని ప్రశ్నించారు. రాజశేఖరెడ్డి హయాంలోని డిస్కంల బకాయిలను కూడా జగనరెడ్డి ఇప్పుడు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత ఇవ్వకుంటే, వారే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని ఆంజనేయులు అన్నారు. 

Updated Date - 2021-10-18T05:00:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising