ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటీఎస్‌తో భారీ వసూళ్ళకు సిద్ధం

ABN, First Publish Date - 2021-11-30T05:19:58+05:30

వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పేరుతో పేదలకు శాశ్వతగృహహక్కు అంటూ జగన్‌మోహన్‌రెడ్డి అండ్‌కో భారీస్థాయిలో వసూళ్లకు సిద్ధమయ్యారని టీడీపీ నరసరావుపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.

జీవీ ఆంజనేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ నేత జీవీ ఆంజనేయులు

నరసరావుపేట టౌన్‌, నవంబరు 29: వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పేరుతో పేదలకు శాశ్వతగృహహక్కు అంటూ జగన్‌మోహన్‌రెడ్డి అండ్‌కో భారీస్థాయిలో వసూళ్లకు సిద్ధమయ్యారని టీడీపీ నరసరావుపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. సోమవారం టీడీపీకార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1983 నుంచి పేదలు నివాసం ఉంటున్న ఇళ్లకు ఇప్పుడు ఈ ప్రభుత్వం హక్కులిచ్చేదేంమిటి? అని ప్రశ్నించారు. ప్రభుత్వం తెచ్చిన జీవో 82ను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. వేలాది హామీలిచ్చిన జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక నవరత్నాలంటూ పేదల జీవితాలను నాశనం చేశాడన్నారు. పన్నులు, అదనపుఛార్టీల పేరుతో ప్రజలనుంచి దోచుకుంటున్నది చాలక, ఇప్పుడు వారి ఇళ్లపై ముఖ్మమంత్రి కన్నేశాడన్నారు. వైసీపీ ప్రభుత్వపాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమైందని, లక్షల కోట్లు జగన్‌, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళుతోందని ఆయన ఆరోపించారు. పేదలకోసం గతంలో చంద్రబాబుప్రభుత్వం కట్టించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా వారి నుంచి కూడా అదనంగా వసూలు చేయాలని సంకల్పించాడన్నారు. ఓటీఎస్‌ పేరుతో ప్రజనుంచి రూ.10 వేలకోట్ల వరకు కాజేయాలనుకుంటున్న వైసీపీ దోపిడీ దొంగల ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. 

Updated Date - 2021-11-30T05:19:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising