ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీలకతీతంగా పంటను కొనుగోలు చేయాలి

ABN, First Publish Date - 2021-05-22T04:32:21+05:30

పంట కొనుగోలులో సొసైటీ ఉద్యోగులను ఒత్తిళ్లకు గురిచేసి రైతులకు అన్యాయం చేయడం సిగ్గుచేటని టీడీపీ నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు.

జీవీ ఆంజనేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవీ ఆంజనేయులు 

వినుకొండ, మే 21: పంట కొనుగోలులో సొసైటీ ఉద్యోగులను ఒత్తిళ్లకు గురిచేసి రైతులకు అన్యాయం చేయడం సిగ్గుచేటని టీడీపీ నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పంట కొనుగోలులో పాలకులు రాజకీయ విభేదాలు చూపి రైతులకు అన్యాయం చేయడం తగదన్నారు. రైతులు పండించిన పంటకు ఒక రకం, వైసీపీ రైతులు పండించిన పంటకు మరో రకంగా రేట్లు నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గ్రామాల్లో రాజకీయ రంగు పులిమి అమాయక రైతులను అధికార పార్టీ నాయకులు అన్యాయం చేయడం దుర్మార్గమని,  రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగుతుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. వేల్పూరులో రాజకీయ భేదాలు చూపుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా రైతులు పండించిన పంటను ఈ-క్రాప్‌ నమోదు ఆధారంగా కొనుగోలు చేయాల్సి ఉండగా, రైతులు మొక్కజొన్న పంటని కొనుగోలు కేంద్రానికి తెస్తే వైసీపీ నాయకులు అనుకూలమైన వారికి టోకెన్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటికైనా పార్టీలకతీతంగా రైతులు పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-05-22T04:32:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising