ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలకు కసరత్తు

ABN, First Publish Date - 2021-10-29T05:47:51+05:30

జిల్లాలో గురజాల, దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఆపాలని దాఖలైన అప్పీళ్లను బుధవారం హైకోర్టు కొట్టివేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  దాచేపల్లి, గురజాల నగర పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌పై అప్పీళ్లను కొట్టివేసిన హైకోర్టు

ఎన్నికల ఏర్పాట్లు చేయాలని ఎస్‌ఈసీ ఆదేశం

దీంతోపాటు జిల్లాలో మూడు మునిసిపల్‌ వార్డులకు ఉప ఎన్నికలు 

  

                  (గుంటూరు - ఆంధ్రజ్యోతి) 

జిల్లాలో గురజాల, దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఆపాలని దాఖలైన అప్పీళ్లను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఎన్నికల నిర్వహణకు ఆటంకాలు తొలిగిపోయాయి. ఈ మేరకు జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఎన్నికల ఏర్పాట్లు చేస్తోంది. దాచేపల్లి, గురజాల నగర పంచాయతీల ఎన్నికలకు ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని, పోలింగ్‌ స్టేషన్లను గుర్తించాలని మునిసిపల్‌ ఆర్డీ గొట్టిపాటి శ్రీనివాసరావుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నుంచి ఆదేశాలు అందాయి. 

  

తొలిసారిగా...

పల్నాడులోని గురజాల, దాచేపల్లి నగర పంచాయతీలకు తొలిసారి నగర పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. నడికుడి, దాచేపల్లి పంచాయతీలను కలిపి దాచేపల్లి నగర పంచాయతీగా మార్చారు. ఈ నగర పంచాయతీలో 20 వార్డులను ఏర్పాటుచేశారు. దాచేపల్లిలో 31,685 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా గురజాల, జంగమహేశ్వరపురం గ్రామపంచాయతీలను కలిపి గురజాల నగర పంచాయతీగా మార్చారు. ఈ నగర పంచాయితీని 20 వార్డులుగా విభజించారు. ఈ పంచాయితీలో 22,603 మంది ఓటర్లు ఉన్నారు. వీటితో పాటు వీటితో పాటు మూడు మునిసిపాలిటీల్లోని మూడు వార్డులకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ వార్డులకు ఎన్నికైన వారు చనిపోవటంతో  ఉపఎన్నికలు నిర్వహించాల్సి వస్తోంది.  రేపల్లె- 16వవార్డు, మాచర్ల - 8వవార్డు, గుంటూరులో 6వ వార్డుకు ఉప ఎన్నికలు జరగబోతున్నట్లు అధికారులు చెప్పారు.   

Updated Date - 2021-10-29T05:47:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising