ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నామినేటెడ్‌ పోస్టుల్లో సమన్యాయం

ABN, First Publish Date - 2021-08-26T05:19:14+05:30

రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవుల పంపిణీలో సీఎం జగన అన్ని సామాజిక వర్గాలకు సమాన అవకాశాలిచ్చినట్లు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు.

హేమమాలినిరెడ్డిని అభినందిస్తున్న ఎంపీ మోపిదేవి వెంటరమణ, డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌  

గుంటూరు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవుల పంపిణీలో సీఎం జగన అన్ని సామాజిక వర్గాలకు సమాన అవకాశాలిచ్చినట్లు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. గుంటూరులో మహిళా ప్రాంగణంలో బుధవారం రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్మనగా పల్లాడ హేమమాలినిరెడ్డి  బాధ్యతలు స్వీకరించారు. కృష్ణదాస్‌ మాట్లాడుతూ వలంటరీ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ నమ్మినవారికి ముఖ్యమంత్రి జగన ఎప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. హేమమాలినిరెడ్డి ప్రసంగిస్తూ మహిళలకు స్వయంఉపాధి పథకాల్లో శిక్షణ ఇచ్చి కుటుంబ ఆదాయాన్ని పెంచటానికి ప్రాధాన్యం ఇస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముస్తాఫా, మద్దాళి గిరిధర్‌, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కృతికాశుక్లా, ఈడీ శ్రీలత, ఆర్డీవో భాస్కరరెడ్డి, మహిళా ప్రాంగణం మేనేజర్‌ కృష్ణవేణి, పీడీ మనోరంజని తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-08-26T05:19:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising