ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడ్డగోలుగా హద్దు దాటి తవ్వకాలు

ABN, First Publish Date - 2021-06-15T05:42:11+05:30

మండలంలోని గొడవర్రు గ్రామ పరిధిలో కృష్ణానది ఒడ్డున ఇసుక యథేచ్ఛగా తోడేస్తున్నారు.

గొడవర్రు శివారులో ఇసుక లోడు చేస్తున్న లారీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుగ్గిరాల, జూన్‌ 14: మండలంలోని గొడవర్రు గ్రామ పరిధిలో కృష్ణానది ఒడ్డున ఇసుక యథేచ్ఛగా తోడేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దు గ్రామాలైన మద్దూరు, గొడవర్రులో  మూడురోజులుగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కొందరు  అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ జిల్లా అధికారులు నిర్ణయించిన సరిహద్దు లోపలే, అనుమతి చ్చిన ప్రకారమే ఇసుక తీస్తున్నామని చెప్పడంతో వెనుదిరిగారు. అధికారపార్టీ అండదండలతోనే, సరిహద్దు దాటి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విషయాన్ని గొడవర్రు గ్రామస్తులు దుగ్గిరాల తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం ఉదయం దుగ్గిరాల మండల సర్వేయర్‌తోపాటు, స్థానిక వీఆర్వో వెంకటేశ్వర్లు రీచ్‌లో తవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి లారీలను, జేసీబీలను వెనక్కు పంపివేశారు. దీనిపై తహసీల్దార్‌ కె.మల్లీశ్వరిని వివరణ కోరగా గొడవర్రు రీచ్‌వద్ద రెండు జిల్లాల సరిహద్దులో ఇసుక తవ్వకాలు తమ దృష్టికి వచ్చిందన్నారు. రెండు జిల్లాల అధికారులు వచ్చి, సరిహద్దులను పరిశీలించే వరకూ తవ్వకాలు నిలిపివేయాలని చెప్పినట్లు తెలిపారు.

Updated Date - 2021-06-15T05:42:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising