ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదకరంగా.. డెంగ్యూ

ABN, First Publish Date - 2021-10-06T05:28:25+05:30

డెంగ్యూ ప్రమాదకరంగా మారింది. గత 15 ఏళ్లలో లేనంత తీవ్రంగా జిల్లాపై ప్రభవం చుపుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్త వేరియంట్‌ వల్లే పెరిగిన తీవ్రత

జిల్లాలో గరిష్ఠ స్థాయిలో జ్వరపీడితులు

సమీక్షలకే పరిమతమవుతున్న అధికారులు


గుంటూరు(సంగడిగుంట), అక్టోబరు 5: డెంగ్యూ ప్రమాదకరంగా మారింది. గత 15 ఏళ్లలో లేనంత తీవ్రంగా జిల్లాపై ప్రభవం చుపుతుంది. ఎన్నో ఏళ్లుగా డెంగ్యూకి చికిత్స అందిస్తున్న వైద్యులు సైతం ఈ ఏడాది ఉన్న పరిస్థితికి ఆశ్చర్యపోతున్నారు. కొత్త వేరియంట్‌ ప్రమాదకరంగా మారినందునే డెంగ్యూ  తీవ్రంగా ఉన్నట్లు పలువురు గుర్తించారు. డెంగ్యూ ప్రారంభమైన తర్వాత 2019లో జిల్లాలో అత్యధికంగా 450 కేసులు అధికారికంగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఈ సంఖ్య ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చెరుకుంది. మరో రెండు నెలలు డెంగ్యూ జ్వరాల ప్రభావం ఉంటుందని అంచనా. గతంలో జ్వరం వచ్చిన తర్వాత మూడు రోజులకుగాని డెంగ్యూ లక్షణాలు కనబడేవి. ఆ తర్వాత మూడు రోజులకు  రోగి అపస్మారకస్థితిలోకి వె ళ్ళేవాడు. ఈ లోపు చికిత్స అందించడంతో మరణాల తీవ్రత తక్కువగా ఉండేది. అయితే ఈ ఏడాది కొత్త వేరియింట్‌ ప్రభావమో మరే ఇతర కారణాల వల్లో కాని మొదటి మూడు  రోజుల్లోనే తీవ్రమైన లక్షణాలతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోతున్నారు. ఈ కారణంగా రోగులకు చికిత్స ఆలస్యమై తీవ్రత పెరుగుతుంది.


వైద్యాధికారుల కొత్త వాదన 

డెంగ్యూ ప్రభావంపై వైద్యాధికారులు కొత్త వాదన తెచ్చారు. 2019లో కూడా డెంగ్యూ తీవ్రంగా ఉందని 2020లో కరోనా కారణంగా శుభ్రత పాటించడం వల్ల ప్రజలు డెంగ్యూకి దూరంగా ఉన్నారంటున్నారు.  అయితే ఈ ఏడాది జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల డెంగ్యూ విజృంభించిందంటున్నారు. అంతేగాని డెంగ్యూ విజృంభణ, వేరియంట్ల ప్రభవంపై  అధ్యయనం చేయడంలేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అధికారులు సమీక్షలకే పరిమితమవుతున్నారనే  విమర్శలు వస్తున్నాయి.


ప్లేట్‌లెట్స్‌ పేరిట దోపిడీ

గ్రామాల్లో జ్వరం బారిన పడితే రోగులకు ఆర్‌ఎంపీలే దిక్కు. వారిని ఆశ్రయించే బాధితులకు వైరల్‌ పరీక్షలు చేయకుండా ఇంజక్షన్ల ఇస్తున్నారు. వీటి కారణంగా జ్వరం తాత్కాలికంగా అదుపులో ఉంటుంది. ఆ తర్వాత మూడు రోజులకు జ్వరం తీవ్రమై ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చిన రోగులకు ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోయాయి అంటూ భయపెట్టి దోపిడీకి తెరలేపుతున్నారు. కనీసం ఒక్కో రోగి నుంచి రూ.లక్ష వరకు పిండేస్తున్నారు. ప్రైవేటు దోపిడీని తట్టుకోలేక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్దామంటే అక్కడ బెడ్లు ఉండటంలేదు. ఈ పరిస్థితుల్లో జిల్లా యంత్రంగం కొత్త వేరియంట్లపై అధ్యయనం చేసి డెంగ్యూ ఉధృతి పెరిగిందా లేదా అనే దానిపై శాస్రీయమైన వివరణ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.   

Updated Date - 2021-10-06T05:28:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising