ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెల్ల బంగారానికి.. గులాబి దెబ్బ!

ABN, First Publish Date - 2021-08-25T05:13:53+05:30

జిల్లాలో పత్తి గూడ దశలో ఉంది. పలు ప్రాంతాల్లో పత్తి మొక్కలపై గులాబి పురుగు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు.

ధ్వంసం చేస్తున్న గులాబిరంగు పురుగు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆందోళనలో పత్తి రైతులు 

క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అవగాహన సదస్సులు

                   (గుంటూరు - ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పత్తి గూడ దశలో ఉంది. పలు ప్రాంతాల్లో పత్తి మొక్కలపై గులాబి పురుగు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు.  రైతులు సకాలంలో గుర్తించకపోతే నష్టతీవ్రత ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. నివారణ చర్యలు వివరిస్తున్నారు. 

- ఎకరానికి 8-10 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి. నెలరోజుల తరువాత ఈ బుట్టలో వుండే ఎర(లూర్‌)ను మార్చాలి. లింగాకర్షక బుట్టలను రోజూ పరిశీలించాలి. దీనిలో పురుగులు 4-5 పడితే, గులాబి రంగు పురుగు తీవ్రంగా ఉన్నట్లు పరిగణించాలి. 

- లింగాకర్షక బుట్టలో 4-5 పురుగులను గమనిస్తే వేపగింజల కషాయాన్ని ఉపయోగించాలి. ఐదుకిలోల వేపపిండిని పదిలీటర్ల నీటిలో కలిపి ఒకరోజు నానబెట్టి కషాయాన్ని తయారుచేయాలి. దీనిని వందలీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి చల్లుకోవాలి. దీనివలన గుడ్డులోని లార్వాదశలో వున్న పురుగు చనిపోయే అవకాశం వుంది.  

- దీని నివారణకు రెండోదశలో ప్రొఫెనోఫాస్‌ రెండు మిల్లీలీటర్లను లీటరు నీటిలో కలిపి ఒక ఎకరానికి చల్లుకోవాలి. ఇది గుడ్డుతోపాటు పురుగును చంపుతుంది. 

- మూడోదశలో క్లోరిఫైరిఫాస్‌ 2.5 మిల్లీలీటర్లను ఒక లీటరు నీటిలో కలిపి ఎకరానికి చల్లుకోవాలి. 

- అప్పటికీ గులాబిరంగు పురుగు అదుపులోకి రాకపోతే ఇమామెక్టిమ్‌ బెంజోయేట్‌(ప్రొక్లెమ్‌)ను చల్లుకోవాలి. 

-  పురుగునివారణకు ఆఖరి అస్త్రంగా సింథటిక్‌ పెరథ్రాయిడ్స్‌ పురుగు మందులను ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. 

రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం..

జిల్లాలో పత్తిలో గులిబీరంగు పురుగును గుర్తించాం. పురుగు నివారణకు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆచార్య  ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాం ప్రాంతీయ పరిశోధన కేంద్రం, కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. పురుగు నివారణకు సూచనలు, సలహాలు కావలసిన వారు 1800 425 0430 టోల్‌ఫ్రీకి ఫోన చేయాలి. - విజయభారతి, వ్యవసాయ శాఖ జేడీ  


Updated Date - 2021-08-25T05:13:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising