ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

611 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-04-16T05:10:40+05:30

జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గురువారం ఉదయం వరకు అందిన 5,137 శాంపిల్స్‌ ఫలితాల్లో 611(11.89 శాతం) మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,573కి పెరిగింది. కొత్తగా గుంటూరు నగరంలో 297 మందికి వైరస్‌ వ్యాప్తి చెందింది. తెనాలిలో 72, మంగళగిరిలో 27, నరసరావుపేటలో 26, తాడేపల్లిలో 25, చిలకలూరిపేటలో 13, చేబ్రోలులో 10 మందికి పాజిటివ్‌ వచ్చింది. అమరావతిలో 3, బెల్లంకొండలో 1, గుంటూరు రూరల్‌లో 7, పెదకూరపాడులో 6, ముప్పాళ్లలో 3, పెదకాకానిలో 9, పెదనందిపాడులో 4, ప్రత్తిపాడులో 4, ఫిరంగిపురంలో 7, సత్తెనపల్లిలో 7, రాజుపాలెంలో 1, తాడికొండలో 2, తుళ్లూరులో 3, కారంపూడిలో 7, మాచర్లలో 1, పిడుగురాళ్లలో 8, బొల్లాపల్లిలో 1, నూజెండ్లలో 2, ఈపూరులో 5, నాదెండ్లలో 1, రొంపిచర్లలో 5, నకరికల్లులో 3, వినుకొండలో 1, భట్టిప్రోలులో 3, చేబ్రోలులో 6, చెరుకుపల్లిలో 5, దుగ్గిరాలలో 8, కర్లపాలెంలో 3, కొల్లిపరలో 6, కొల్లూరులో 4, కాకుమానులో 1, నిజాంపట్నంలో 1, పొన్నూరులో 2, రేపల్లెలో 4, చుండూరులో 2, వేమూరులో 5 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. కాకుమాను మండలం లక్ష్మీపురంకు చెందిన వృద్ధురాలు(65) కరోనాతో గురువారం మృతి చెందినట్లు పేర్కొన్నారు. 


కరోనాతో కానిస్టేబుల్‌ మృతి

 తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బత్తిపూడి సాంబశివరావు(47) గురువారం ఉదయం మృతి చెందినట్టు పోలీసు అధికారులు తెలిపారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండవ డోసు వేయించుకున్న తరువాత అనారోగ్యంగా ఉండడంతో ఈ నెల 11 నుంచి సాంబశిరావు సెలవులో ఉన్నాడు. గురువారం తెల్లవారుజామున సాంబశివరావు తీవ్ర అస్వస్థతకు గురవడంతో గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. పరీక్షలు నిర్వహించగా కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు.  

Updated Date - 2021-04-16T05:10:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising