ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీకాలు పొందడం ప్రతి పౌరుడి జన్మహక్కు: శైలజానాథ్

ABN, First Publish Date - 2021-06-03T18:13:30+05:30

కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి పాలకులు అసమర్ధతను చాటుకున్నారన్నారు. కరోనా మరణాలను పూర్తిగా బయట పెట్టడంలేదని వ్యాఖ్యానించారు. గంగా నదిలో నుంచి శవాలు కొట్టుకొస్తున్నాయన్నారు. పల్లాలు, గంటలు కొడితే కరోనా పోతుందా? అని ప్రశ్నించారు. టీకాలు పొందడం ప్రతి పౌరుడి జన్మహక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు గతంలో ఉచితంగా టీకాలు వేసిన చరిత్ర కాంగ్రెసు పార్టీది అని గుర్తుచేశారు. 8 కోట్ల డోసులను బయటదేశాలకు అమ్ముకున్నారని ఆరోపించారు.


వ్యాక్సిన్‌కు మూడు రకాల రేటు వ్యాపార దృక్పథం చాటుతోందని మండిపడ్డారు. మూడో వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారని... మూడో వేవ్ వచ్చేలోగానే టీకా కార్యక్రమం పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సల్ టీకా వేయాలనేది పీసీసీ అధ్యక్షుడు డిమాండ్ అని చెప్పారు. అందరికీ టీకాలు ఇవ్వాలని4న రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు తెలుపనున్నట్లు తెలిపారు. ప్రతి నెల పేద కుటుంబాలకు రూ. 7,500 ఇచ్చి సాయం చేయాలని కాంగ్రెస్ నేత డిమాండ్ చేశారు. సమస్యను వివరించేందుకు గవర్నర్‌ను కలవనున్నామని చెప్పారు. కరోనా ఖర్చుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కరోనా మరణాలను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందని ప్రశ్నించారు. కరోనా సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు రూ.1000 కోట్లు ఇవ్వాలన్నారు. బడ్జెట్ సమావేశాల్లో కరోనాపై కనీసం చర్చించని అసమర్ధ ప్రభుత్వమిది అంటూ శైలజానాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2021-06-03T18:13:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising