ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి అప్పలరాజుపె ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-05-13T06:14:08+05:30

రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజుపై టీడీపీ నేతలు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, మే 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజుపై టీడీపీ నేతలు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, పశ్చిమ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర, న్యాయవాది కాలే దేవదాసుతో కలిసి మంత్రి అప్పలరాజుపై బుధవారం ఫిర్యాదు అందించారు. ఎన్‌ 440కే రకం వైరస్‌ విజృభిస్తుందని, అది ప్రమాదకరమైందని టీవీల్లో మంత్రి మాట్లాడిన విషయం ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా రోగులకు కనీసం ఆక్సిజన్‌ సరఫరా చేయలేని ప్రభుత్వం.. విపక్ష నేతలపై కేసులు పెట్టడంలో బిజీగా ఉందని నేతలు శ్రావణ్‌కుమార్‌, కోవెలమూడి రవీంద్రలు విమర్శించారు. మంత్రి వ్యాఖ్యలు సామాన్యులు భయపడేలా ఉన్నాయన్నారు. మంత్రి తీరుతో ఏపీ ప్రజలను పొరుగు రాష్ట్రాలవారు చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిదర్శనం సరిహద్దులో తెలంగాణ ప్రభుత్వం అంబులెన్సులను ఆపటమేనన్నారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ అయిన వైద్యసిబ్బంది, పోలీసు, పారిశుధ్య కార్మికులు, పారామెడికల్‌ సిబ్బంది భయాందోళనలకు, మానసిక ఒత్తిడికి లోనువుతున్నారన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని మంత్రిపై అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నేతలు మానుకొండ శివప్రసాద్‌, చిట్టాబత్తిని చిట్టిబాబు, కనపర్తి శ్రీనివాసరావు, కొమ్మినేని కోటేశ్వరరావు, ఎం.ధారునాయక్‌, కంచర్ల శివరామయ్య, కొత్తపల్లి కోటేశ్వరరావు, నాయుడు ఓంకార్‌, యర్రంనేని ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-13T06:14:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising