ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్లు తవ్వితే ఏజన్సీలకు అనుమతుల నిలుపుదల

ABN, First Publish Date - 2021-06-22T06:39:49+05:30

నగరంలో ఎక్కడైనా కేబుల్‌ స్థంభాలు, లైన్ల కోసం రోడ్లుతవ్వితే కేబుల్‌ ఏజన్సీలకు అనుమతులు నిలిపివేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ స్పష్టం చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ చల్లా అనురాధ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగర కమిషనర్‌ చల్లా అనురాధ

గుంటూరు (కార్పొరేషన్‌), జూన్‌ 21: నగరంలో ఎక్కడైనా కేబుల్‌ స్థంభాలు, లైన్ల కోసం రోడ్లుతవ్వితే కేబుల్‌ ఏజన్సీలకు అనుమతులు నిలిపివేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ స్పష్టం చేశారు. సోమవారం  జీఎంసీలో కేబుల్‌ ఏజన్సీల ప్రతినిధులు, పట్టణ ప్రణాళిక అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఇష్టానుసారంగా కేబుల్‌లైన్లు వేస్తూ పైప్‌లైన్‌లను డ్యామేజ్‌ చేయడం వలన తాగునీరు కలుషితం అవుతోందన్నారు. ఆయా ప్రాంతాల ఏఈకి లైను వివరాలు పూర్తిగా ఇచ్చి, వారి అనుమతి తీసుకుని మాత్రమే పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఇంచార్జ్‌ ఎస్‌ఈ డి.శ్రీనివాస్‌, ఇంచార్జ్‌ సిటీ ప్లానర్‌ సత్యనారాయణ, డిప్యూటీ సిటీ ప్లానర్‌ హిమబిందు, టీపీఎస్‌లు, ఏఈలు, వివిధ సంస్థల కేబుల్‌ ఏజన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. 

 డ్రైన్లపై ఆక్రమణలు తొలగించాలి

నగరంలో డ్రైన్లపై ఆక్రమణలను తొలగించాలని నగర కమిషనర్‌ చల్లా అనురాధ ఆదేశించారు. సోమవారం పొత్తూరి వారి తోటలో పారిశుధ్య పనులని, నందమూరి కాలనిలో నూతనంగా నిర్మించిన కాలువలను తనిఖీచేశారు. నిర్మాణ అనంతరం లోపాలు వస్తే సంబంఽధిత కార్యదర్శిదే బాధ్యత అని అన్నారు. పర్యటనలో యస్‌ఈ డి.శ్రీనివాస్‌, డీఈఈలు ప్రసాద్‌, రఫిక్‌, ఎస్‌ఎస్‌ ఆనందకుమార్‌, ఏఈలు రాంబాబు, దుర్గా ప్రసాద్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు రత్నం, రాజేష్‌, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-06-22T06:39:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising