టిడ్కో లబ్ధిదారులు నగదు చెల్లించాలి
ABN, First Publish Date - 2021-10-22T05:11:19+05:30
జిల్లాలో టిడ్కో గృహ సముదాయాల్లో ఫ్లాట్స్‌కి ఎంపికైన లబ్ధిదారులు వారి వాటా మొత్తం నగదును తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వివేక్‌యాదవ్ ఆదేశించారు.
కలెక్టర్ వివేక్‌యాదవ్
గుంటూరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో టిడ్కో గృహ సముదాయాల్లో ఫ్లాట్స్‌కి ఎంపికైన లబ్ధిదారులు వారి వాటా మొత్తం నగదును తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వివేక్‌యాదవ్ ఆదేశించారు. ఈ విషయంలో మెప్మా, మునిసిపల్ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ అంశాలపై గురువారం కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వలంటీర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. పేదలందరికీ ఇళ్ల పథకం లబ్ధిదారులందరినీ డ్వాక్రా సంఘాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్లు ఏఎస్ దినేష్‌కుమార్, రాజకుమారి, అనుపమ అంజలి, కే శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌వో కొండయ్య, పంచాయతీరాజ్ ఎస్‌ఈ బ్రహ్మయ్య, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఆనంద్‌నాయక్, వ్యవసాయ శాఖ జేడీ విజయభారతి పాల్గొన్నారు.
Updated Date - 2021-10-22T05:11:19+05:30 IST