ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

80 శాతం మందికి తొలిడోసు వ్యాక్సినేషన్‌ పూర్తి

ABN, First Publish Date - 2021-07-27T04:19:40+05:30

కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రతీ ఒక్కరు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ పేర్కొన్నారు.

కొవిడ్‌ ప్రచార ఆటో ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, జూలై 26: కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రతీ ఒక్కరు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో కొవిడ్‌ వాక్సినేషన్‌పై అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే జిల్లాలో కేంద్రం అనుమతించిన వివిధ కేటిగిరీలకు చెందిన వారిలో 80శాతం మేర ప్రజలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించామని అన్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య వాఖ వద్ద అందుబాటులో 1.40 లక్షల వ్యాక్సిన్‌లు ఉన్నాయన్నారు. ఫ్రంట్‌లైన్‌, హెల్త్‌కేర్‌ వర్కర్లు, గర్భిణులు, ఐదేళ్ల లోపు పిల్లలున్న తల్లులు, 45 ఏళ్ల వయస్సు దాటిన వారు, విదేశాలకు వెళ్లేవారు, ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు ప్రాధాన్యం ఇచ్చి వ్యాక్సిన్‌ వేస్తున్నామన్నారు. కరోనా వైరస్‌ సమస్య జిల్లాలో ఇంకా కొనసాగుతోందన్నారు. మాస్కుని తప్పనిసరిగా ధరించడం, చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడం, తగిన జాగ్రత్తలను నిరంతరం పాటిస్తూనే ఉండాలని స్పష్టం చేశారు. మాస్కు పెట్టుకోని వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అనంతరం మాస్కే కవచం పేరుతో రూపొందించిన కరపత్రాలను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆటో ర్యాలీ కార్యక్రమానికి జెండా ఊపి కలెక్టర్‌ ప్రారంభించారు.  కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు ఏఎస్‌ దినేష్‌కుమార్‌, పి.ప్రశాంతి, కె.శ్రీధర్‌రెడ్డి, అనుపమ అంజలి, పులిచింతల ఎస్‌డీసీ వినాయకం, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.యాస్మిన్‌, డీటీసీ మీరా ప్రసాద్‌, డీఆర్‌డీఏ పీడీ ఆనంద్‌నాయక్‌, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T04:19:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising