ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమర జవాన్ల కుటుంబాలకు అండగా నిలవాలి

ABN, First Publish Date - 2021-12-08T05:37:21+05:30

దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమించి అమరులైన జవాన్ల కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ పేర్కొన్నారు.

అమరుల కుటుంబాలకు విరాళం అందజేస్తున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

గుంటూరు, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమించి అమరులైన జవాన్ల కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని  కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ పేర్కొన్నారు. మంగళవారం సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ తన క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఎన్‌సీసీ క్యాడెట్లకు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం లోపల, వెలుపల ఎన్నో సవాళ్లని సాయుధ దళాలు ఎదుర్కొని వీరోచితమైన సేవలు అందిస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాయన్నారు. దేశ రక్షణలో అశువులు బాసిన వీరజవాన్లు, వారిపై ఆధారపడినన కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ఏటా డిసెంబరు 7వ తేదీన సాయుధ దళాల పతాక దినోత్సవం జరుపుతోన్నామన్నారు. వ్యాపార, పారిశ్రామికవేత్తలు విరివిగా విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎం.బాలాజీ, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-08T05:37:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising