ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశ సేవలో భాగస్వాములు కావాలి

ABN, First Publish Date - 2021-10-29T05:19:16+05:30

దేశ సేవలో యువ శిక్షణ ఐఏఎస్‌లు భాగస్వాములై సమర్థవంతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు.

కలెక్టర్‌తో సమావేశమైన ట్రైనీ ఐఏఎస్‌లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్రైనీ ఐఏఎస్‌లకు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ సూచన

గుంటూరు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): దేశ సేవలో యువ శిక్షణ ఐఏఎస్‌లు భాగస్వాములై సమర్థవంతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు. సమగ్ర భూసర్వే విధానంపై గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భూసర్వేపై పట్టు సాఽధించి వివాదాలకు తావు లేకుండా సర్వే కార్యక్రమం పూర్తి చేసేందుకు సహకరించాలన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో జరుగుతున్న భూముల సర్వే కావడంతో ప్రతీ అంశాన్ని నిశితంగా గమనించాలన్నారు. జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ సమగ్ర భూసర్వే విధానంలో పట్టా సబ్‌ డివిజన్‌, భూమి కేటాయింపు, భూసేకరణ, ఎఫ్‌లైన్‌ అప్లికేషన్‌, రికార్డుల పరిశీలన, ఆధునిక సాంకేతికతని ఉపయోగించడం ద్వారా పునః సమీక్ష అనే విధానాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.  


Updated Date - 2021-10-29T05:19:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising