ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశ్వక్రీడల్లో మన జెండా రెపరెపలాడాలి

ABN, First Publish Date - 2021-07-25T05:09:40+05:30

టోక్యో ఒలింపిక్స్‌లో క్రీడాకారులు భారతదేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసేలా రాణించాలని జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆకాక్షించారు.

ర్యాలీలో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, మేయర్‌ కావటి, ఎమ్మెల్యే ముస్తఫా, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

క్రీడాకారులకు మద్దతుగా నగరంలో ర్యాలీ

గుంటూరు (క్రీడలు), జూలై 24: టోక్యో ఒలింపిక్స్‌లో క్రీడాకారులు భారతదేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసేలా రాణించాలని జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆకాక్షించారు. విశ్వక్రీడల్లో పతకాలు సాధించాలని భారత క్రీడాకారులకు మద్దతుగా స్టెప్‌, నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని నగర మేయర్‌ కావటి మనోహరనాయుడు, ఎమ్మెల్యే ముస్తఫాలతో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అందివచ్చిన అవకాశాలను ఆసరాగా చేసుకుని పోటీల్లో రాణించి పతకాలను సాధించాలన్నారు. మేయర్‌ కావటి మాట్లాడుతూ పతకాల సాధనలో దేశం సత్తాచాటాలన్నారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో దేశక్రీడాకారులతో పాటు రాష్ట్ర క్రీడాకారులు ప్రతిభను కనబర్చాలని ఆకాక్షించారు. కలెక్టరేట్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ హిందూ కళాశాల కూడలి మీదుగా నెహ్రూ యువకేంద్రం కార్యాలయం వరకు సాగింది. ర్యాలీలో నెహ్రూ యువకేంద్రం రాష్ట్ర  డైరెక్టర్‌ ప్రసన్న, జేసీలు దినేష్‌కుమార్‌, శ్రీధర్‌రెడ్డి, స్టెప్‌ సీఈవో శ్రీనివాసరావు, ఆర్డీవో భాస్కరరెడ్డి, యువ కేంద్రం జిల్లా యువ సమన్వయ అధికారి దేవిరెడ్డి కిరణ్మయి, హకీ కోచ మురళీధర్‌, బీఆర్‌ స్టేడియం కోచ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-25T05:09:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising