ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్మీ ర్యాలీ విజయవంతం

ABN, First Publish Date - 2021-07-30T06:31:24+05:30

వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో జిల్లాలో రెండు వారాల పాటు కొనసాగిన ఏడు జిల్లాల ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ విజయవంతమైనట్లు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు.

ఆర్మీ అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో జిల్లాలో రెండు వారాల పాటు కొనసాగిన ఏడు జిల్లాల ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ విజయవంతమైనట్లు  కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు. గురువారం బీఆర్‌ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ అభ్యర్థులకు అమ్మ ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా ఉచిత భోజనం, వసతి సౌకర్యం కూడా కల్పించారని చెప్పారు. ఆర్మీ రిక్రూటింగ్‌ అధికారి కల్నల్‌ శేహ్లాద్‌ కోహ్లీ మాట్లాడుతూ ర్యాలీకి మొత్తం 25,831 మంది అభ్యర్థులు హాజరయ్యారని చెప్పారు.కాగా నిర్ణీత తేదీల్లో కొవిడ్‌ సర్టిఫికెట్లు సమర్పించని అభ్యర్థులకు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ దినేష్‌కుమార్‌, స్టెప్‌ సీఈవో డాక్టర్‌ శ్రీనివాసరావు, అర్బన్‌ అదనపు ఎస్పీ గంగాధర్‌రావు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జే యాస్మిన్‌, డీపీవో కేశవరెడ్డి, మునిసిపల్‌ ఇంజనీర్‌ శాంతిరాజు, మైనింగ్‌ ఏడీ విష్ణువర్థనరావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-30T06:31:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising