ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూరుశాతం పోలింగ్‌ లక్ష్యం

ABN, First Publish Date - 2021-03-07T05:44:10+05:30

గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓటింగ్‌లో ఎక్కువమంది పాల్గొని రాష్ట్రంలో జిల్లాన్ని ప్రఽథమ స్థానంలో నిలబెట్టాలని కలెక్టర్‌, ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌


గుంటూరు(కార్పొరేషన్‌), మార్చి 6: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓటింగ్‌లో ఎక్కువమంది పాల్గొని రాష్ట్రంలో జిల్లాన్ని ప్రఽథమ స్థానంలో నిలబెట్టాలని కలెక్టర్‌, ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌ కోరారు. శనివారం ఎన్టీఆర్‌ స్టేడియంలో వాకర్స్‌కి ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటరు ప్రతిజ్ఞ పోస్టర్‌ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నూరుశాతం  పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు. పోలింగ్‌ కేంద్రాల్లో వికలాంగులకు వీల్‌ చైర్లు, మహిళలకు ప్రత్యేక క్యూలైన్‌లు, సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కమిషనర్‌ చల్లా అనురాధ మాట్లాడుతూ వార్డు సచివాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఆర్డీవో భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ తప్పనిసరిగా ఓటు వేయడంతో పాటు చుట్టుపక్కల వారిని కూడా ఓటు వేసేలా చైతన్య పరచాలన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌ డి.శ్రీనివాసరావు, ఈఈ డి.శ్రీనివాస్‌, తహసీల్దార్లు మోహనరావు, శ్రీకాంత్‌, వాకర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు లాల్‌వజీర్‌, డి.శ్రీనివాసరావు, అన్నమయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T05:44:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising