ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు

ABN, First Publish Date - 2021-02-26T05:47:08+05:30

అడిగేవారు, అడ్డుకునేవారు లేరనుకున్నారో ఏమో పట్టపగలే మండలంలోని ఉన్నవ గ్రామపరిధిలోని సర్వే నెం.281లోని 17 ఎకరాల ఆచార్యుల చెరువులో మట్టిని తవ్వి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఆచార్యుల చెరువులో జరుగుతున్న తవ్వకాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టపగలే.. ఉన్నవ చెరువులో దోపిడీ

ఉన్నవ(యడ్లపాడు), ఫిబ్రవరి 25: అడిగేవారు, అడ్డుకునేవారు లేరనుకున్నారో ఏమో పట్టపగలే మండలంలోని ఉన్నవ గ్రామపరిధిలోని సర్వే నెం.281లోని 17 ఎకరాల ఆచార్యుల చెరువులో మట్టిని తవ్వి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతులు లేకుండా ఎక్స్‌కవేటర్లు పెట్టి మరీ మట్టిని తరలిస్తున్నారు.  సుమారు పది అడుగుల లోతులో ఇప్పటికి తవ్వకాలు జరిగాయి. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు తవ్వకాలను ఆపేయించాలని స్థానిక వీఆర్వో జయరాజ్‌ను ఆదేశించారు. దీంతో ఆయన గురువారం  చెరువు వద్దకు వచ్చి తవ్వకాలు ఆపాలని ఆదేశించగా తొలుత స్పందించారు. ఆ తర్వాత స్థానిక అధికార పార్టీ నాయకుడి అనుచరుడొకరు అక్కడకు వచ్చి తవ్వకాలు నిలిపివేసేది లేదని తేల్చి చెప్పాడు. దీనితో వీఆర్వో ఉన్నతాధికారులకు విషయాన్ని ఫోన్‌ద్వారా తెలియజేశారు. ఉన్నతాధికారులు సదరు అధికార పార్టీ నాయకుడిని కార్యాలయానికి పిలిపించి మాట్లాడి తవ్వకాలను నిలుపుదల చేయించారు. అయితే అక్రమ తవ్వకాలపై కేసులు నమోదు చేయకపోవడం.. వాహనాలను స్వాధీనం చేసుకోకపోడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2021-02-26T05:47:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising