ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపా చట్టాలతో పౌర స్వేచ్ఛకు విఘాతం

ABN, First Publish Date - 2021-01-24T05:55:05+05:30

పౌర స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్న ఉపా చట్టాన్ని రద్దు చేయాలని ఉపా రద్దు పోరాట కమిటీ కన్వీనర్‌, ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు.

సభలో ప్రసంగిస్తున్న పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌, రాజేంద్రప్రసాద్‌, ముప్పాళ్ళ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపా రద్దు పోరాట కమిటీ 

గుంటూరు, జనవరి 23: పౌర స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్న ఉపా చట్టాన్ని రద్దు చేయాలని ఉపా రద్దు పోరాట కమిటీ కన్వీనర్‌, ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు.  శనివారం గుంటూరులోని బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో  సభ నిర్వహించారు. చిలుకా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ప్రజల డిమాండ్‌ను గుర్తించి ఉపా చట్టాన్ని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్నారు. ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు, ఐలు జాతీయ ఉపాధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ఉపా చట్టం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ  మోదీ, జగన్‌ ప్రభుత్వాలు నిరంకుశంగా పౌరుల స్వేచ్ఛను హరిస్తున్నాయన్నారు.  ఐఎన్‌టీయూ జాతీయ కార్యదర్శి పి.ప్రసాద్‌, చైతన్య మహిళా సంఘం (సిఎంఎస్‌) తెలుగు రాష్ట్రాల కన్వీనర్‌ జ్యోతి ప్రసంగించారు. సభలో  పౌర హక్కుల సంఘం రాష్ట్ర న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ, ఐఏపీఎల్‌ న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్‌, ఓపిడిఆర్‌ నాయకులు హనుమంతరావు, చావలి సుధాకరరావు, ఐఎఫ్‌టియు రాష్ట్ర కార్యదర్శి, కె.పోలారి, కేఎన్‌పీఎస్‌ నాయకులు టి.కృష్ణ,  గంగాభవాని, రాధ, అరసవల్లి కృష్ణ, తదితరులు ప్రసంగించారు.  


Updated Date - 2021-01-24T05:55:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising