ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజ్ఞాన కేంద్రం ప్రారంభం

ABN, First Publish Date - 2021-01-18T05:14:15+05:30

మండల కేంద్రం యడ్లపాడులో నూతనంగా నిర్మించిన పోపూరి రామారావు విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగాయి.

స్వేచ్ఛ.. సేద్యం పుస్తకాన్ని ఆవిష్కరించిన బీవీ రాఘవులు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యడ్లపాడు, జనవరి 17 : మండల కేంద్రం యడ్లపాడులో నూతనంగా నిర్మించిన పోపూరి రామారావు విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగాయి.  వివిధ ప్రాంతాల నుంచి కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ పతాకాలతో ప్రధాన వీధుల్లో ప్రదర్శన చేశారు. అనంతరం విజ్ఞాన కేంద్రానికి చేరుకుని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సీపీఎం జెండాను ఆవిష్కరించి కేంద్రాన్ని ప్రారంభించారు. సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.కృష్ణయ్య కాన్ఫరెన్స్‌హాలును, జిల్లా కార్యదర్శులు గద్దె చెలమయ్య, పాశం రామారావు గెస్ట్‌ రూమ్‌, ఆఫీస్‌ రూమ్‌ను ప్రారంభించారు. ప్రజానాట్యమండలి కళాకారులు విప్లవ, అభ్యుదయ గీతాలు ఆలపిస్తూ నృత్య ప్రదర్శన చేశారు. లింగారావుపాలెం గ్రామస్థులు రచించిన స్వేచ్ఛ సేద్యం పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. సీపీఎం నాయకులు ముత్తవరపు సురేష్‌బాబు, జరుగుల శంకరరావు, ముత్తవరపు రామారావు, పద్మారావు, నూతలపాటి కాళిదాసు, పోపూరి సుబ్బారావు, చెరుకూరి సత్యనారాయణ, చిలకలూరిపేట విద్యాసంఘం అధ్యక్షుడు తేళ్ల సుబ్బారావు, నల్లమడ రైతుసంఘం కన్వీనర్‌ కొల్లా రాజమోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-18T05:14:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising