ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకుడి అరెస్టు

ABN, First Publish Date - 2021-10-28T05:53:53+05:30

క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఐపీడీ కాలనీ 10వ లైనుకు చెందిన తండెపు చరణ్‌ను అరెస్టు చేసినట్లు నగరంపాలెం సీఐ హైమారావు తెలిపారు.

నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న నగరంపాలెం సీఐ హై మారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, అక్టోబరు 27: క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఐపీడీ కాలనీ 10వ లైనుకు చెందిన తండెపు చరణ్‌ను అరెస్టు చేసినట్లు నగరంపాలెం సీఐ హైమారావు తెలిపారు. అహల్య టవర్స్‌లోని ప్లాట్‌లో  ఆనలైన క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తుండగా దాడి  పట్టుకున్నామన్నారు. అతడి నుంచి కలర్‌ టీవీ, మూడు ల్యాప్‌టాప్‌లు, 12 సెల్‌ఫోన్లు, 60 వేల నగదు, రూటర్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్‌ వరకు చదివిన చరణ్‌ చెడు అలవాట్లకు లోనై అవసరమైన డబ్బుల కోసం క్రికెట్‌ బెట్టింగ్‌ ద్వారా తేలిగ్గా సంపాదించవచ్చనే ఆశతో కొంతకాలంగా బెట్టింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు  తెలిపారు. స్నేహితులైన సంగడిగుంటకు చెందిన పెద్దిరెడ్డి సుధాకరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మాచర్లకు చెందిన శ్రీను, నంబూరి త్రిలోక్‌, నరసరావుపేటకు చెందిన రామిరెడ్డి తదితరులతో కలిసి క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పోలీసులు దాడి చేసే సమయంలో శ్రీనివాసరెడ్డి, సుధాకరరెడ్డిలు టీ తాగేందుకు బయటకు వెళ్లినట్టు చరణ్‌ తెలిపాడు. ఈ కేసులో మిగిలిన ఐదుగురిని అరెస్టు చేయాల్సి ఉందని సీఐ తెలిపారు. 


Updated Date - 2021-10-28T05:53:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising