ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసాంఘిక కార్యక్రమాలను ఉపేక్షించేది లేదు..

ABN, First Publish Date - 2021-04-13T06:00:12+05:30

అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని బాపట్ల డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు హెచ్చరించారు.

సూర్యలంకరోడ్డులో పేకాట క్లబ్‌ నిర్వహిస్తున్న సన్నీ రిసార్ట్స్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాపట్ల డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు 

బాపట్ల, ఏప్రిల్‌ 12: అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని బాపట్ల డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు హెచ్చరించారు. బాపట్ల మండలం సూర్యలంకరోడ్డులో ముత్తాయపాలెం గ్రామంలోని సన్నీ రిసార్ట్స్‌లో ఆదివారం పోలీసులు దాడులు చేసి 34మందిని అరెస్ట్‌ చేసి వారి నుంచి  రూ.24లక్షల 70వేల నగదు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.  కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల వారితోపాటు భీమవరం, హైదరాబాద్‌కు చెందిన అనేకమంది జూదరులు ఇక్కడ కోత ముక్క ఆడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. జూదరులను అరెస్ట్‌చేసి నగదు స్వాఽధీనం చేసుకున్నందుకు రూరల్‌ సీఐ కె.శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ కిరణ్‌లతోపాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. కాగా సన్నీ రిసార్ట్స్‌ ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇక్కడ జరుగుతున్న ఆసాంఘిక కార్యక్రమాలపై పెద్దఎత్తున ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ సంబంధిత పోలీసులు పట్టించుకోకపోవటంతో ఇక్కడ కార్యకలాపాలకు అడ్డులేకుండా పోయింది. రాష్ట్రస్థాయిలో ఇక్కడ పేకాట క్లబ్‌ పెట్టి లక్షల రూపాయలతో కోతముక్క ఆట ఆడుతున్నారు. రాజకీయ అండదండలు, పోలీసుల సహకారంతో ఈ క్లబ్‌ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చివరకు జిల్లా అధికారుల ఆదేశాలతో బాపట్ల రూరల్‌ పోలీసులు దాడి చేశారు. 

Updated Date - 2021-04-13T06:00:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising