ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులపై దాడులు అరికట్టాలి

ABN, First Publish Date - 2021-01-18T05:27:45+05:30

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలనిమాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్‌ అన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అరుణ్‌ కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అరుణ్‌ కుమార్‌

తుళ్లూరు, జనవరి 17: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలనిమాలమహానాడు జాతీయ  అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం తుళ్ళూరులో మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడటానికి రాష్ట్రంలో మాలలు ఎంతో కృషి చేశారన్నారు.  ఇటీవల దళితులపై దాడులు పెరిగాయని  ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు సోము వీర్రాజు, బండి సంజయ్‌లు దళితులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. భగవద్గీత కావాలా.. బైబిల్‌ పార్టీ కావాలా అంటూ వారు మాట్లాడిన తీరు అజ్ఞానానికి నిదర్శనమన్నారు.  తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.  వర్గీకర ణ కాలం చెల్లిన అంశమని అన్నారు. ఈ సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు విప్పర్ల భాస్కర్‌, మహిళా అధ్యక్షురాలు పిల్లి మేరి, రాష్ట్ర నాయకులు గేరె రత్తయ్య, వెంకటేశ్వర్లు, కంతేటి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.  తాడికొండ నియోజకవర్గ మాలమహానాడు  కన్వీనర్‌గా సరిగల శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 


Updated Date - 2021-01-18T05:27:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising