ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారం చోరీ చేసిన ఇద్దరి అరెస్టు

ABN, First Publish Date - 2021-05-06T05:17:00+05:30

రద్దీ ప్రదేశాల్లో ఆటోఎక్కిన వారి నుంచి నగదు, ఆభరణాలు దోచుకుంటున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి రూ.5లక్షల విలువైన 108 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ విజయ్‌చంద్ర తెలిపారు.

నిందితుల వివరాలు ప్రకటిస్తున్న పట్టణ సీఐ విజయ్‌చంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్తెనపల్లి, మే 5:  రద్దీ ప్రదేశాల్లో ఆటోఎక్కిన వారి నుంచి నగదు, ఆభరణాలు దోచుకుంటున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి రూ.5లక్షల విలువైన 108 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ విజయ్‌చంద్ర తెలిపారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గత నెల 27న ధూళ్లిపాళ్లకు చెందిన చిమట సాంబయ్య తాకట్టుపెట్టిన బంగారు ఆభరణాలు విడిపించుకుని వాటిని జేబులో ఉంచుకుని తన గ్రామానికి వెళ్లేందుకు పట్టణంలోని మెయిన్‌రోడ్డుకు వచ్చాడు. అటుగా వస్తున్న ఆటో ఎక్కాడు. ఆటో నడుపుతున్న గుంటూరుకు చెందిన గోనా శివయ్య, అందులోనే ప్రయాణిస్తున్న బి.సంసోను చాకచక్యంగా సాంబయ్య వద్ద ఉన్న బంగారాన్ని దొంగతనం చేశారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత సాంబయ్యను దించివేశారు. కిందికి దిగి తన జేబు చూసుకోగా నగలు దొంగతనానికి గురైనట్లు గుర్తించాడు. వెంటనే సాంబయ్య పట్టణ పోలీస్టేషన్‌లో పిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసి శివయ్య, సంసోనును అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇద్దరిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారన్నారు. 

Updated Date - 2021-05-06T05:17:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising