ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్య కేసులో నిందితుడి అరెస్టు

ABN, First Publish Date - 2021-04-13T05:57:59+05:30

ఇటీవల నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శ్రీనివాసరావుతోట వేణుగోపాలపురంలో జరిగిన తోట శిరీష (24) హత్య కేసు మలుపుతిరిగింది.

హతురాలు శిరీష, కుమారుడు లోకేశ్‌తో భర్త తిరుపతిరావు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్‌ఐపై ఆరోపణలు

విచారణకు ఉన్నతాధికారుల ఆదేశం

గుంటూరు, ఏప్రిల్‌ 12: ఇటీవల నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శ్రీనివాసరావుతోట వేణుగోపాలపురంలో జరిగిన తోట శిరీష (24) హత్య కేసు మలుపుతిరిగింది. ఆమెను గత నెల 26న ఆమె భర్త తోట తిరుపతిరావు ఆమెను కత్తితో నరికి హతమార్చాడు. ఈ కేసులో పోలీసులు తిరుపతిరావును అరెస్టు చేశారు.  సోమవారం నిందితుడు తిరుపతిరావును అరెస్టు చేసి మెజిస్ర్టేటు వద్ద హాజరుపర్చగా రిమాండ్‌ విధించినట్టు నగరంపాలెం సీఐ మల్లికార్జునరావు తెలిపారు. 

కాగా తనపై అత్త, నగరంపాలెం ఎస్‌ఐ తప్పుడు కేసు నమోదు చేసి వేధించిన మూలంగానే తాను ఈ హత్యకు పాల్పడ్డానని నిందితుడు తిరుపతిరావు మీడియాకు వెల్లడించారు. నిందితుడిని జైలుకు తరలిస్తున్న తరుణంలో హత్యకు దారి తీసిన కారణాలను వివరించాడు. కుమారుడిని కిడ్నాప్‌ చేశానని, తమ భార్య, అత్తలపై హత్యాయత్నానికి పాల్పడ్డానని, ఇలా అనేక రకాల తప్పుడు కేసులు బనాయించి మానసికంగా హింసించడం వల్లే హత్య చేశానని నిందితుడు వెల్లడించారు. నిందితుడి ఆరోపణలపై ఇప్పటికే పోలీసు శాఖలో కలకలం రేగింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. నిందితుడు వెల్లడించిన అంశాలను నగరంపాలెం పోలీసులు నమోదు చేసి ఎస్పీకి నివేదిక పంపినట్లు తెలిసింది.  


Updated Date - 2021-04-13T05:57:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising