ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరుకున్న కల్తీ, నకిలీలపేరును తొలగిస్తాం

ABN, First Publish Date - 2021-04-16T05:06:51+05:30

కల్తీలు, నకిలీలతో గుంటూరుకున్న చెడ్డపేరును తొలగిస్తామని ఏపీ ఎరువులు, పురుగుమందు డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి తెలిపారు.

నాగిరెడ్డిని సత్కరిస్తున్న ఆతుకూరి ఆంజనేయులు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ ఎరువులు, పురుగుమందు డీలర్లసంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి

గుంటూరు, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): కల్తీలు, నకిలీలతో గుంటూరుకున్న చెడ్డపేరును తొలగిస్తామని  ఏపీ ఎరువులు, పురుగుమందు డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి తెలిపారు. విజయవాడలో గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ ఎరువులు, పురుగు మందులు, విత్తనాల డీలర్ల సంక్షేమ సంఘం ఎన్నికల్లో గుంటూరుకు చెందిన నాగిరెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరుకు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడ కల్తీలు, నకిలీలలు దొరికినా దానిమూలాలు గుంటూరులో వెలుగులోకొస్తున్నట్లు చెప్పారు. దీనిని తొలగించటానికి అసోసియేషన్‌ కృషి చేస్తుందన్నారు. కల్తీ, నకిలీ వ్యాపారులకు సహకరించేదిలేదన్నారు.    రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను అందిస్తామన్నారు. కల్తీఎరువులు, పురుగుమందులు, నకిలీవిత్తనాలు, అనుమతిలేని బయోలను అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టే కార్యక్ర మాలకు అండగా ఉంటామని తెలిపారు. ఏపీ ఎరువులు, పురుగుమందు, విత్తన డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన నాగిరెడ్డిని గురువారం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, ఇతర వ్యాపారసంఘాల నేతలు సత్కరించారు.  


Updated Date - 2021-04-16T05:06:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising