ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగుల జీవితాలతో చలగాటం

ABN, First Publish Date - 2021-06-22T18:26:17+05:30

జాబ్ క్యాలెండర్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగుయువత


తెనాలి: జాబ్ క్యాలెండర్ అంటూ మాయ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగుల జీవితాలతో సీఎం జగన్మోహన్‌రెడ్డి చలగాటమాడుతున్నారని తెలుగు యువత నాయకులు పాలడుగు ప్రణీత్ విమర్శించారు. సోమవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రణీత్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఉద్యోగాల కల్పనపై వేలాది రూపాయలు కోచింగ్‌లకు ఖర్చు చేసి సొంత గ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అంటూ పదివేల పోస్టులను విడతల వారీగా భర్తీ చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగ లోకం విస్మయానికి గురైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ 1,2 పోస్టుల సంఖ్యపెంచి తక్షణమే నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శ్రీధర్, దినేష్, గుమ్మడి భార్గవ్, పూర్ణ, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T18:26:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising